Friday, March 29, 2024

100 శాతం వ్యాక్సినేషన్‌తో రికార్డు సృష్టించిన గ్రామం

జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం భారత్‌లోనే 100 శాతం వ్యాక్సినేట్ అయిన తొలి గ్రామంగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వేయ‌న్ గ్రామం ఖాతాలోకి ఈ ఘన‌త వెళ్లింది. ఆ ఊరిలో ఉన్న వ‌యోజనులు అంతా వ్యాక్సిన్ కోవిడ్‌ తీసుకున్నారు. 362 మంది వ‌యోజ‌నులు ఉన్న ఆ గ్రామానికి హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు వెళ్లి వ్యాక్సినేట్ చేశారు.

కానీ ఆ ఊరికి వెళ్లాలంటే స‌రైన రోడ్డు మార్గం లేదు.. క‌నీసం 18 కిలోమీట‌ర్ల దూరంలో కాలిన‌డ‌క‌న వెళ్లాల్సి వ‌స్తోంది. గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగ‌ల‌కు చెందిన‌వార‌ని, వాళ్లు త‌మ వ‌ద్ద ఉన్న గోవుల‌ను తీసుకుని ఎత్తైన కొండ‌ల‌కు వెళ్తుంటార‌ని, వారికి వ్యాక్సిన్ ఇవ్వ‌డం ఓ పెద్ద టాస్క్ అని ఆరోగ్య‌శాఖ అధికారులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ గ్రామానికి ఇంట‌ర్నెట్ లేద‌ని, వాళ్ల‌కు అపాయింట్మెంట్లు లేవ‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ బాషిర్ అహ్మ‌ద్ ఖాన్ తెలిపారు. జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌భుత్వం రూపొందించిన మోడ‌ల్ ప్ర‌కారం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఆ రాష్ట్రంలో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement