Thursday, April 25, 2024

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్‌ ఆప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి అయింది.

యాజమాన్యకోటాలో మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్‌ ఆప్‌ రౌండ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 14న బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. అర్హత నిబంధనలు ఇతర వివరాలకు WWW.KNRUHS.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement