Tuesday, April 23, 2024

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు 22, 23వ తేదిల్లో వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంబీబీఎస్‌ యాజమాన్యకోటా సీట్లకు ఈనెల 22, 23వ తేదిల్లో వెబ్‌ ఆప్షన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవ్వాల (బుధవారం) స్ట్రే వెకెన్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌ యాజ మాన్య కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. యాజమాన్య కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 22న గురువారం ఉదయం 10 గంటల నుంచి 23వ తేదిన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. అర్హత నిబంధనలు ఇతర సమాచార వివరాలకు WWW.KNRUHS.TELANGANA.GOV.IN
వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement