Monday, November 11, 2024

కన్వీనర్‌ కోటాలో బీడీఎస్‌ సీట్ల భర్తీకి 14,15వ తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ప్రభుత్వ, ప్రైవేట్‌ దంత కళాశాలల్లో కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు మాప్‌ ఆప్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. రెండవ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వాాం భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 14న బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 15వ తేది సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement