Friday, March 29, 2024

యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 16,17వ తేదిల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: యూజీ ఆయూష్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకిగాను ఈనెల 16,17వ తేది వరకు రెండవ విడత కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్‌ కళాశాలల్లో హోమియోపతి (బిహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యూనాని(బీయూఎంఎస్‌), నేచురోపతి యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటాసీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 16న ఉదయం 8 గంటల నుంచి 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులల్లో సీటు పొందిన అభ్యర్ధులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement