Saturday, April 20, 2024

Delhi | ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం.. కేంద్రంపై టీఆర్ ఎస్ ఎంపీ కేకే ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో ప్రజల వాయిస్ వినిపించేందుకు అవకాశమివ్వాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. సభ జరిగే 17 రోజుల కాలంలో 25 బిల్లులు ప్రవేశపెట్టడమంటే ఇక చర్చకు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షాలు దొంగలు, మేం మంచి వాళ్ళం అనేలా మాట్లాడుతున్నారని కేకే విమర్శించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, బొగ్గు కేటాయింపులపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడించారు. పార్లమెంట్‌లో 50 శాతం సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చకు కేటాయించాలని అబిప్రాయపడ్డారు. జీ20 నిర్వహించడం గొప్ప కాదని కేకే చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement