Friday, April 19, 2024

ప్ర‌తి ఓట‌రు కాళ్ల‌కి దండం పెట్టి ఓట్లు అడుగుతాం-రేవంత్ రెడ్డి

ఓటుని అడ‌గ‌డంలో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. న‌గ‌దు..గిఫ్ట్స్ ఇలా ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వారు ఓట్లు అడుగుతుంటారు. కాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో సీనియ‌ర్ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని అందరు తీర్మానించారు. అయితే గెలవటం ఎలాగన్నదే అసలు సమస్య. అందుకోసం ప్రచారంలో కొత్తపంథాని అనుసరించాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ అదేమిటంటే ఓట్లేయమని ఓటర్లను అభ్యర్ధించటం చేతులు పట్టుకుని కాళ్ళనుకోమని అనటం మామూలుగా జరిగేదే. అయితే దాన్నే ఆచరణలోకి తీసుకురావాలని సమావేశం నిర్ణయించిందట. ప్రచారానికి వెళ్ళినపుడు ప్రతిఓటరు కాళ్ళకి దండం పెట్టి ఓట్లడగాలని ఫైనల్ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం లక్షమంది ఓటర్ల కాళ్ళను మొక్కి ఓట్లడగబోతున్నారట.ప్రతి గ్రామానికి ఐదుగురు నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కూడా సమావేశం నిర్ణయించింది. కాళ్ళకుమొక్కి ఓట్లేడిగే ప్రచారాన్ని ముందు రేవంత్ రెడ్డే ప్రారంభించబోతున్నారట. సిట్టింగ్ స్ధానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత అవస్తలు పడుతున్నదనేందుకు ఈ నిర్ణయమే తాజా ఉదాహరణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement