Saturday, November 30, 2024

AP | మూడేళ్లలో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ

రాజధాని అమరావతి నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. కాగా, చీఫ్ ఇంజినీర్ల సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

డిసెంబర్‌ చివరిలోగా అమరావతికి సంబంధించిన అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా ప్రణాళికలు వేస్తున్నామని…. రూ.30 వేల కోట్ల టెండర్లకు సంబంధించి పనులు ఇప్పటికే మొదలయ్యాయని వివరించారు. హైకోర్టు, అసెంబ్లీ ఐకానిక్ భవనాలు మినహా.. మిగిలినవి మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement