Thursday, March 28, 2024

యూపీఏ చెల్లింపుల్లో మనమే టాప్‌..

డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే భారత్‌లో ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం తెలిపారు. ”డిసెంబర్‌ 2022లో, డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు వార్షిక ప్రాతిపదికన 1.5 ట్రిలియన్‌ డాలర్లులుగా ఉన్నాయి. మీరు యూఎస్‌, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లలోని మొత్తం డిజిటల్‌ లావాదేవీలను కలిపితే, భారతదేశ గణాంకాలు అంతకంటే ఎక్కువ అని దావోస్‌ శిఖరాగ్ర సదస్సులో మంత్రి చెప్పారు. ఇటీవలి కాలంలో దేశంలో డిజిటల్‌ రూపంలో చెల్లింపులు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో, యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ 12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అదే నెలలో మొత్తం 782 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement