Thursday, May 26, 2022

తాలిపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండ‌లంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో ఆ జ‌లాశ‌యం నిండు కుండ‌లా తయారైంది. ప్రాజెక్టు సామ‌ర్థ్యం 74 మీట‌ర్లు కాగా ప్ర‌స్తుతం 73.14 మీట‌ర్ల మేర నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 2,695 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

మరోవైపు పాల్వంచ ప‌రిధిలోని కిన్నెర‌సాని రిజ‌ర్వాయ‌ర్‌కు కూడా వ‌ర‌ద నీరు కొన‌సాగుతోంది. ఈ రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం 407 ఫీట్లు కాగా ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 400 అడుగులకు చేరింది. కాగా జిల్లాలోని ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రిజర్వాయర్‌లో ఇద్దరు మహిళలు గల్లంతు

Advertisement

తాజా వార్తలు

Advertisement