ఐపీఎల్ 2023కి ఢిల్లి క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఈ మేరకు ఢిల్లి క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటన చేసింది. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికిగురైన నేపథ్యంలో, డిల్లి జట్టు స్వల్ప మార్పులు చేసింది. పంత్ స్థానంలో అనుభవజ్ఞుడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని భావించింది.
- Advertisement -
ఈ క్రమంలో ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్, జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఐదు సార్లు ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు.