Thursday, April 18, 2024

వాల్తేరు వీరయ్య.. ట్రైలర్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్యిఈ మూవీ జనవరి13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ మూవీని బాబీ (కేఎస్‌ రవీంద్ర) రూపొందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మెగా మాస్‌ ట్రైలర్‌ అప్‌డేట్ రాబోతుందంటూ కొత్త పోస్టర్‌ను లాంఛ్ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి టీం అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందించింది.

ఈ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని.. పోల్‌పై విన్యాసం చేస్తుంటే పక్కనే ప్రదీప్‌ రావత్‌, శ్రీనివాస్‌ రెడ్డి హమ్‌ చేస్తున్న తాజా లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ట్రైలర్‌ ఎలా ఉండబోతుందో డైరెక్టర్ బాబీ తాజా లుక్‌తో చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్‌ పార్టీ స్పెషల్ సాంగ్‌లో అందరినీ మెస్మరైజ్ చేయబోతుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement