Thursday, April 25, 2024

వాల్తేరు వీర‌య్య చిత్రం నుండి బాస్ పార్టీ సాంగ్.. మాస్ లుక్ లో అదిరిన మెగాస్టార్

వాల్తేరు వీర‌య్య చిత్రం నుండి బాస్ పార్టీ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత ఆయన ఈ తరహా మాస్ లుక్ తో కనిపిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ‘బాస్ పార్టీ’ అనే ఒక మాస్ నంబర్ ను అందించాడు. ఆ పాటను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. చిరంజీవి – బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన పాట ఇది. ‘క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే’ అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ సాహిత్యాన్ని అందించి ఆయన పాడారు. నకష్ అజాజ్ – హరిప్రియ ఈ పాటను ఆలపించారు. చిరంజీవి మోడ్రన్ ముఠామేస్త్రి తరహాలో లుంగీ పైకి కట్టి స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ బాగుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement