Tuesday, March 19, 2024

వోడాఫోన్‌ బకాయిలు ఈక్విటీ మార్పు.. ఈక్విటీతో ప్రభుత్వానికి 33 శాతం వాటా

తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్‌ ఐడియా సంస్థ స్పెక్ట్రమ్‌ చెల్లింపులు, ఎయిర్‌వేస్‌ వినియోగానికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను, వాటికి సంబందించి అన్ని వడ్డీలను ఈక్విటీగా మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. వోడాఫోన్‌ ఐడియా మొత్తం 16130 కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చాల్సి ఉంటుంది. ఒక్కో ఈక్విటీ షేరును 10 రూపాయల చొప్పున మొత్తం 16.13 బిలియన్‌ షేర్లను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సంవత్సరకాలంగా రుణాన్ని ఈక్విటీ మార్చేందుకు ప్రభుత్వ అనుమతి కోసం వోడాఫోన్‌ ఐడియా ఎదురు చూస్తోంది.

వోడాఫోన్‌ ఐడియా ఇండస్‌ టవర్స్‌ వంటి సంస్థలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిధుల సేకరణ చేయాల్సి ఉంది. 5జీ పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంది. 16130 కోట్లను ఈక్విటీ గా మార్చడం వల్ల ప్రభుత్వానికి వోడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 33 శాతం వాటాదారుగా అవతరించనుంది. దీంతో ప్రభుత్వమే అతి పెద్ద వాటాదారుగా మారనుంది. ఈ పరిణామంతో మార్కెట్‌లో వోడాఫోన్‌ఐడియా కంపెనీ షేరు ధర 1 శాతం పెరిగి 6.89 రూపాయల వద్ద ముగిసింది. ఈ ప్రైవేట్‌ టెలికమ్‌ సంస్థకు ప్రస్తుతం 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement