Friday, April 19, 2024

పెద్దపల్లి రైళ్ల రాకపోకలపై చర్యలు చేపట్టండి.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీజేపీ నేత వివేక్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పెద్దపల్లి ప్రాంతంలోని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయవలసినదిగా బీజేపీ సీనియర్ నేత, జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్దపల్లిలోని బోధలం స్టాప్‌లో పుష్పుల్, రామగిరి ట్రైన్లను ఆపాలని కోరారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు.

మంచిర్యాలలో ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాప్‌కి అనుమతి ఇస్తామని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు వివేక్ తెలిపారు. ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయనేది ప్రజలకు తెలపాలని ప్రధానమంత్రి దిశానిర్దేశం చేశారని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

బడ్జెట్ వివరాలను ప్రజలకు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం సుశీల్ కుమార్ మోడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో వివేక్ వెంకట్ స్వామి సభ్యుడిగా ఉన్నారు. మంగళవారం జరిగిన కమిటీ వివరాలను ఆయన వెల్లడించారు. బడ్జెట్‌లోని ప్రధాన అంశాలపై వివిధ రాష్ట్రాల్లో కేంద్రమంత్రులు లేదా సీనియర్ నాయకులు మీడియా సమావేశాల ద్వారా వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్టు వివేక్ తెలిపారు. ఏయే రాష్ట్రాలకు ఎవరు వెళ్లాలో కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement