Friday, March 29, 2024

కోర్టు అడ్డంకులను దాటుకుని.. థియేటర్​కు చేరిన ‘కాశ్మీర్​ ఫైల్స్’

కాశ్మీర్​ పండిట్ల జీవిత కథ ఆధారంగా తీసిన ‘కాశ్మీర్​ ఫైల్స్’ సినిమా ​ ఎట్టకేలకు ఇవ్వాల దేశ వ్యాప్తంగా రిలీజ్​ అయ్యింది.  అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించిన ఈ సినిమాను అడ్డుకోవడానికి చాలామంది ట్రై చేశారు. కోర్టులో కేసులు వేశారు. కానీ, కాశ్మీర్ ఫైల్స్ షెడ్యూల్ ప్రకారం థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌లో ముస్లింలు కాశ్మీరీ పండిట్‌లను చంపేస్తున్నారని, తద్వారా ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించినట్టుగా ఉందని గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే.. దానిని బాంబే హైకోర్టు కొట్టివేసింది. కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీరీ పండిట్ల జీవితాల ఆధారంగా.. వాస్తవ ఘటనల నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని మేకర్స్​ తెలిపారు.

ఆ తర్వాత అమరవీరుడు స్క్వాడ్రన్ లీడర్ అయినా రవి ఖన్నా భార్య కూడా ఈ సినిమాపై ఫిర్యాదు చేసింది. చిత్రం విడుదలకు ఒక రోజు ముందు అంటే నిన్న (గురువారం) జమ్మూ కాశ్మీర్‌లోని కోర్టులో పిల్​ వేసింది. భారత వైమానిక దళ అధికారి భార్య నిర్మల్ ఖన్నా తన భర్తకు సంబంధించి వాస్తవ సన్నివేశాలకు విరుద్ధంగా ఉన్న దృశ్యాలను తొలగించాలని, సవరించాలని కోరింది. దీంతో దివంగత IAF స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నాపై చిత్రీకరించిన సన్నివేశాలను ప్రదర్శించవద్దని ది కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ ప్రమోటర్లను కోర్టు ఆదేశించింది. కాగా, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ నేతృత్వంలోని బృందం 1990 జనవరి 25న శ్రీనగర్‌లో కాల్చి చంపిన నలుగురు IAF సిబ్బందిలో రవి ఖన్నా ఒకరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement