Sunday, May 9, 2021

తెలంగాణలో వైరస్ విజృంభణ… కొత్తగా 53 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7646 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం… తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఇందులో 3,55,618 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,727 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అలాగే కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 53 మంది మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2261కి చేరింది.తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,441 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి- 631, రంగారెడ్డి- 484, సంగారెడ్డి- 401, నిజామాబాద్‌- 330, నల్గొండ- 285, సిద్దిపేట- 289, సూర్యాపేట- 283, మహబూబ్‌నగర్‌- 243, జగిత్యాల జిల్లాలో 230 కేసులు వెలుగు చూశాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News