Friday, March 29, 2024

విరూపాక్షగా సాయిధ‌ర‌మ్ తేజ్.. అదరగొట్టిన ఎన్టీఆర్ వాయిస్

తన 15వ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్.ఈ మూవీని కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.కాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివిల్ చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేశారు. ఈ టైటిల్‌ గ్లింప్స్‌ ను ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ తో రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ‘విరూపాక్ష‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ ను పెట్టారు. అలాగే, ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిలో 21న రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement