Tuesday, April 23, 2024

కార్తి తాజా చిత్రం విరుమ‌న్-ట్రైల‌ర్ రిలీజ్

విరుమ‌న్ చిత్ర ట్రైల‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో త‌మిళ హీరో కార్తి న‌టిస్తున్నారు. ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు అధితి హీరోయిన్‌గా న‌టించింది. ఈ అవుట్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్టు 12న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.లేటెస్ట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. కార్తి మాస్ ఫైట్‌ల‌తో అద‌ర‌గొట్టాడు. ప్ర‌కాష్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్లు ఆక‌ట్టుకుంటున్నాయి. సూరి కామెడీ పంచ్‌లు న‌వ్విస్తున్నాయి. కార్తి, అధితి మ‌ధ్య కెమెస్ట్రీ బాగా కుదిరినట్లు క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement