Saturday, April 20, 2024

జూన్ 17నే విరాట‌ప‌ర్వం !

హీరో రానా న‌టించిన లెటెస్ట్ చిత్రం విరాట‌ప‌ర్వం. గ‌తేడాది ప్ర‌థ‌మార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఉత్త‌ర తెలంగాణ‌లో 1990లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించాడు. ఒక‌నొక స‌మ‌యంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇటీవ‌లే ఈ పుకార్ల‌కు చెక్ పెడుతూ మేక‌ర్స్ విడుద‌ల తేదీని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 1న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం విరాట ప‌ర్వం ప్రీ పోన్ కానున్న‌ట్లు తెలుస్తుంది. మొద‌ట‌గా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అన్ని కుదిరితే జూన్‌17న ఈ చిత్రం విడుద‌ల కానుందని టాక్‌. దీనిపై చిత్ర‌బృందం నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement