Wednesday, April 24, 2024

వైరల్ వీడియో: నీటిలో ఈదుకుంటూ పడవ దగ్గరకు వచ్చిన పాము

యూట్యూబర్ బ్రాడీ మోస్ పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు పడవ సహాయంతో సముద్రంలోకి వెళ్లిన సమయంలో నీటి నుంచి బయటకు వచ్చిన పాము.. అతని వెంట పడింది. ఒక్క క్షణం ఆ పడవపై తల పెట్టి, మళ్లీ ఏమనుకుందో ఏమో? వెనుతిరిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత నీటిలోపలకు వెళ్లి మాయమైంది.

సాధారణంగా నీటి పాములు మనుషుల జోలికి రావని ఈ వీడియోలో బ్రాడీ చెప్పడం వినిపిస్తుంది. కానీ ఏడాదిలో ఈ సమయంలో మాత్రం అవి జత కోసం వెతుకులాడుతూ ఉంటాయట. చాలా చిరాకు పడుతూ ఉండటంతోనే అది తనను వెంబడించిందని బ్రాడీ వివరించాడు. ఇలాంటి సముద్రపు పాములు నీటి లోపల 250 అడుగుల లోతుకు వెళ్లి కనీసం 8 గంటలు గడిపేస్తాయని తెలుస్తోంది. కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

https://twitter.com/444molls/status/1432654551908339712
Advertisement

తాజా వార్తలు

Advertisement