Wednesday, April 24, 2024

యాక్ష‌న్ కి ఎక్కువ‌.. క్యామెడీకి త‌క్కువ‌… విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌… మూవీ రివ్యూ..

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌… మూవీ రివ్యూ..
నటీనటులు : కిరణ్ అబ్బవరం, క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ, ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు
ఛాయాగ్రహణం : డేనియల్ విశ్వాస్
సంగీతం : చైతన్ భరద్వాజ్
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత‌ : ‘బన్నీ’ వాస్
ద‌ర్శ‌క‌త్వం : మురళీ కిషోర్ అబ్బూరు (నందు)
కథ :
విష్ణు (కిరణ్ అబ్బవరం) చిన్నతనంలో అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. విష్ణు బాబుకి అన్నీ తాతే. ఆ తాతగారు ఏమో మాట్లాడితే.. సూక్తులు చెప్పడం మొదలు పెడతాడు. ఆ సూక్తులన్నీ వినేసి.. మన విష్ణు బాబు చాలా మంచివారైపోతాడు . మరోవైపు నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో విష్ణు జీవితంలోకి ఎంట్రీ ఇస్తోంది దర్శన (కాశ్మీరీ పరదేశి). ఫేమస్ యూట్యూబర్ అయిపోవాలని లైవ్ మర్డర్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ ఫేక్ కథలో శర్మ (మురళీ శర్మ) కూడా తన ఫేక్ ప్లేను సమర్ధవంతంగా అప్లై చేశాడు. ఈ కథలో ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ?, అసలు దర్శన ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది ?, ఇంతకీ ఈ శర్మ ఎవరు ?, ఈ మొత్తం కథలో మన కిరణ్ బాబు చేసిన యాక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి అని చిన్న మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా.. ఈ డిజిటల్ సినిమా కాలంలో కూడా పాత కాలపు పాయింట్లు, అది కూడా అర్ధం పర్ధం లేని పాత్రలు రాసుకుని.. ఆయా పాత్రల చేత సూక్తులు చెప్పిస్తే ఎలా ?, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు (నందు) కథకుడిగా విఫలం అయ్యాడు. హీరో కిరణ్ అబ్బవరం కు యాక్షన్ పిచ్చి పట్టినట్టు ఉంది. ఒక్క హిట్ ఖాతాలో పడగానే తాను గొప్ప యాక్షన్ హీరోని అనుకుంటే ఇదుగో ఇలాగే ఉంటుంది వ్యవహారం. బాబుకు బాలయ్య రేంజ్ లో ఫైట్లు పెట్టారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ రొటీన్ అండ్ సిల్లీ యాక్షన్ చూపిస్తే ఎలా ?. ద దీనికి తోడు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ లో కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. నిజానికి సినిమాలో దర్శకుడు నందు చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతుంది. కథ పరంగా ఇంటర్నల్ లింక్స్ తో సాగే స్క్రీన్ ప్లేలోని డెప్త్ అండ్ ఇంట్రెస్ట్ ను దర్శకుడు పట్టుకోలేకపోయాడు. క‌శ్మీరా ప‌ర్ధేశీ నటన పర్వాలేదు. మురళీ శర్మ బాగా నటించాడు.
ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ బాగున్నాయి..సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది..ఈ కాలం జ‌నాల‌కు ఈ మూవీ ఎక్కుతుందో లేదో కాల‌మే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement