Wednesday, April 24, 2024

వంద రోజులు పూర్తి చేసుకున్న విక్రమ్..100డేస్ ఫంక్షన్ చేసేందుకు ప్లాన్

విక్రమ్ మూవీ రిలీజ్ అయి కాసుల వర్షాన్ని కురిపించింది. విశ్వనటుడు కమల్ హాసన్ లోని నటనని మరోసారి చూపించారు. కాగా ఈ చిత్రం విడుదలయి వంద రోజులు పూర్తి చేసుకుంది. దాంతో విక్రమ్ చిత్రం 100డేస్ ఫంక్షన్ ని చేయనున్నారు.చెన్నై లోని ‘కలైవనార్ అరంగం’ ఇందుకు వేదిక కానుంది. నవంబర్ 7వ తేదీన ఈ వేడుకను జరపనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించారు. కమల్ హాసన్ సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమా, 300 కోట్లకి పైగా వసూళ్లతో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. పలు సెంటర్స్ లో విక్రమ్ 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ 100 రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement