Wednesday, April 24, 2024

డిఫరెంట్ గెటప్ప్ లో విక్రమ్.. నాలుగు గంటలసేపు మేకప్

పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడంలో మహాదిట్ట త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్..కాగా ఆయన తాజాగా న‌టిస్తోన్న చిత్రం తంగాల‌న్. అప్పట్లో ‘నరాచీ’ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పొడవైన గుబురు గెడ్డం .. గోచీగుడ్డతో కనిపించనున్నాడు. చెవికి పోగులు .. చేతిలో కర్ర .. ముంజేతికి కడియంతో కనిపించనున్నాడు. ఈ పాత్రకి సంబధించిన మేకప్ కోసం ఆయనికి 4 గంటల సమయం పడుతోందట. అంతసేపు ఓపికగా కూర్చోవటం ఆయన సహనానికి నిదర్శనమని అంటున్నారు. ఈ చిత్రంలో పార్వతీ మీనన్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement