Saturday, April 20, 2024

హోంగార్డు గన్ మిస్‌ఫైర్ ఘటనలో ట్విస్ట్

విజయవాడలో సోమవారం ఉదయం కలకలం రేపిన హోంగార్డు గన్ మిస్ ఫైర్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కాలేదని.. భార్యపై భర్త వినోద్ కాల్పులు జరిపినట్లు తేలింది. వినోద్ కుమార్ అనే హోంగార్డు సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ దగ్గర అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా హోంగార్డు వినోద్‌కు భార్య సూర్య రత్నప్రభకు వివాదం జరుగుతోంది. నాలుగు నెలలగా భార్య నగలు తాకట్టు పెట్టిన విషయంలో గొడవపడుతున్నారు. ఆదివారం రాత్రి వివాదం తీవ్ర స్థాయికి వెళ్ళడంతో భార్యపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. భార్య అక్కడక్కడే చనిపోగా.. పోలీసులను తప్పుదోవ పట్టించే క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యిందని చెప్పాడు. అతడిని పోలీసులు ప్రశ్నించడంతో.. నిజం ఒప్పుకున్నట్లు విజయవాడ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. వినోద్‌పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే హోంగార్డు వినోద్ మూడు రోజుల క్రితం ఏఎస్పీ అనంతపురం క్యాంప్‌కు వెళ్లాడు. ఏఎస్పీ తుపాకీ హోం గార్డ్ వినోద్ దగ్గర ఉండటంతో ఆదివారం రాత్రి భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యిందని.. భార్య గుండెల్లోకి బులెట్ దూసుకెళ్లిందని చెప్పాడు. పోలీసులు అనుమానంతో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. మరోవైపు ఉన్నతాధికారి దగ్గర ఉండాల్సిన గన్ హోంగార్డు దగ్గర ఉండటంపైనా పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement