Thursday, April 25, 2024

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

పులిచింతల డ్యామ్ గేటు విరిగిపోవడంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 4,39,975 గా ఉంది. అటు ఔట్ ఫ్లో 4.28,120 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద నీరు మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

వరదనీరు పెరుగుతున్న కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు అలర్టుగా ఉండాలని అధికారులు సూచించారు. మద్దిగూడెం, చింతమోటు, పెదలంక, పెసర్లంక ఓలేరు, పల్లిపాలెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అటు జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు కావాల్సిన వాటిని సమకూర్చాలని, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: జగిత్యాలలో జాలరుకు చిక్కిన అరుదైన దెయ్యం చేప

Advertisement

తాజా వార్తలు

Advertisement