Friday, April 19, 2024

గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష….విజయశాంతి పిలుపు

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు బీజేపీ మహిళా నేత విజయశాంతి. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణలేదని ఆరోపించారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించటం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయింది.

తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా అని ప్రశ్నించారు విజయశాంతి.రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరగబోతున్న ‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విజయశాంతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement