Monday, April 12, 2021

యూట్యూబ్‌ ఛానెళ్లు అబద్ధపు ప్రచారాలు!

ప‌లు యూట్యూబ్ ఛానెళ్లు తనపై చేస్తున్న అస‌త్య ప్ర‌చారంపై మాజీ ఎంపీ, బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను తాను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు యూట్యూబ్‌ ఛానెళ్లు అబద్ధపు ప్రచారాలతో వాళ్లు బతికి, తెలంగాణలో సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందామన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తానని చెప్పారు.

ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్థించని ఏ ఒక్క సినిమా హీరో చిత్రాలను గాని, వ్యక్తులను గాని నేడు కేసీఆర్ ఒక అవగాహనతో సమర్థిస్తున్న తీరులో తాను మాట్లాడటం ఎప్పటికీ జరగదని విజయశాంతి స్పష్టం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News