Thursday, September 23, 2021

ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా: విజయసాయిరెడ్డి

కేంద్ర మాజీ మంత్రీ మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రవిమర్శలు చేశారు. ఆయన భూములు, దేవాలయంలో ఆస్థులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టు కు వెళ్లి మళ్ళీ పదవి తెచ్చుకోవడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. పంచగ్రామాల భూసమస్య ను న్యాయస్థానంలో ఉండటం వలన..న్యాయ పరిధిలో త్వరగా పరిష్కరిస్తామన్నారు. అశోక్ గజపతి రాజు విషయంలో దేవాలయంలో అన్ని స్కాములేనని… వాటిని అన్నిటిని వెలుగులోకి తీసుకువచ్చి దేవాలయం ఆస్తులను కాపాడతామని తెలిపారు. అసలు దేవాస్థానం ఆస్తులు పరాధీనం పాలు అవుతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తున్నామన్నారు. అశోక్ పైకి చెప్పేదొకటి..లోపల చేసేది ఒకటని విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. అప్పన్న దేవాలయానికి సంబంధించిన భూముల అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని…అసలు ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా అని ఫైర్‌ అయ్యారు విజయ సాయి రెడ్డి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Cristiano Ronaldo: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News