Thursday, March 28, 2024

విజయ్ దేవరకొండ ‘లైగర్’ టీజర్ వాయిదా

ఈరోజు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ‘లైగర్’ టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీ టీజ‌ర్‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంక్షోభ స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా.. వాయిదా వేయ‌డ‌మే మంచిద‌ని భావించినట్లు తెలిపింది.

ఈ ట్వీట్ పట్ల హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. కొన్ని సార్లు వెయిట్ చేయడమే మంచిదని, ముందు మనం, మన ఫ్యామిలీలు బాగుండాలని ఆకాంక్షించాడు. అందరం బాగుంటేనే అప్పుడు దేనినైనా సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నాడు. తనను ప్రేమించేవారందరూ సేఫ్‌గా ఉండాలని కోరాడు. కాగా ‘లైగర్’ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్‌గా, సెకండ్ హాఫ్‌లో ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్‌గా కనిపిస్తాడని ఫిలింనగర్‌లో టాక్ వస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement