Friday, January 27, 2023

క్రీడారంగంలోకి విజయ్ దేవరకొండ..

హైదరాబాద్‌ : ప్రముఖ వాలీబాల్‌ టీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హక్‌కు సహ యజయానిగా సెన్సెషనల్‌ హీరో విజయ దేవరకొండ సహ యజమానిగా మారారు. దేశ వ్యాప్తంగా అశేష అభిమానగణం కలిగిన యువ సూపర్‌స్టార్‌ , ఫిలింఫేర్‌ అవార్డు, నంది అవార్డు, సైమా అవార్డు సహా ఎన్నో అవార్డులు గెలుచకున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్‌ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్ టీమ్ కు సహ యజమాని అయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ జట్టు జెర్సీని ఆవిష్కరించారు. . తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌. ‘అర్జున్‌ రెడ్డి’ మరియు ‘పెళ్లి చూపులు ’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన శ్రీ విజయ్‌ దేవరకొండ , బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే బ్లాక్‌హాక్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సహ యజమానిగానే కాక ఆయన పలు సంస్థలలోనూ పెట్టుబడులు పెట్టి సీరియల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌గానూ నిలిచారు. విజయ్‌ తన సొంత స్ట్రీట్‌వేర్‌ ఫ్యాషన్‌ లైన్‌ రౌడీ, ఓ థియేటర్‌ మల్టీప్లెక్స్‌ ఏవీడీ, రీజనల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అహ సహ యజమాని మరియు మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌ కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిగి ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement