Sunday, October 13, 2024

అల్లు అర్జున్ రికార్డు సమం చేసిన విజయ్ దేవరకొండ

యూత్‌లో హీరో విజయ్ దేవరకొండకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిన విషయమే. తెలంగాణ యాసతో డైలాగులు చెప్పే విజయ్ దేవరకొండ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విజ‌య్ ఆ త‌ర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో త‌న ఫాలోయింగ్ మ‌రింత పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బంది ప‌డుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోలైగ‌ర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 13 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సాధించి స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రప్ఫాడిస్తున్నారు. అలా ఇన్‌స్టాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇటీవ‌ల అల్లు అర్జున్ 13 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ని చేరుకోగా, కొద్ది రోజుల‌కే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా రేట్ ఫీట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవరకొండ ‘లైగర్’ అనే మార్షల్ ఆర్ట్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: నా తదుపరి మూవీ థియేటర్‌లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తా: నాని

Advertisement

తాజా వార్తలు

Advertisement