Thursday, April 25, 2024

షూటింగ్ లో గాయపడ్డ తమిళ హీరో విజయ్ అంటోనీ

తమిళ హీరో విజయ్ ఆంటోని తన చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. దీనితో చిత్ర యూనిట్ అతడిని మలేషియాలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కండిషన్ స్టేబుల్ గా ఉందట. కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. .. బోట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ బోట్ లో ప్రయాణిస్తూ నటిస్తున్నాడు. పక్కనే వేరే పడవలో కెమెరామెన్, ఇతర సిబ్బంది చిత్రీకరిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న బోట్ అదుపు తప్పి పడవని ఢీకొట్టింది. దీనితో ఈ ప్రమాదం సంభవించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement