Thursday, November 7, 2024

హంగామా సృష్టించిన విజ‌య్.. అజిత్ ఫ్యాన్స్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ మూవీ వారీసు..మ‌రో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు త‌మిళ‌నాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.బుధవారం ఈ రెండు సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు సందడి చేసారు. తమ అభిమాన హీరో ప్లెక్సీలు, కటౌట్లకు పాలాభిషేకాలు, పూలదండలు వేస్తూ అభిమానం చాటుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా తమ హీరోకు పోటీగా సినిమా విడుదల చేసిన హీరో సినిమా పోస్టర్లను చింపేస్తూ హంగామా సృష్టించారు. ఇలా అజిత్, విజయ్ ఫ్యాన్స్ ఓ థియేటర్ వద్ద పోస్టర్లు చించుతూ హంగామా సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా అభిమానం ముదిరి ఒక హీరో అభిమానులు ..మరో హీరో సినిమా పోస్టర్లను చింపేస్తూ వీరంగం సృష్టించ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement