Thursday, April 25, 2024

వ్యవసాయ ఉత్పత్తుల నకిలీపై విజి’లెన్స్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హోల్‌సేల్‌ డీలర్లు, రిటైల్‌ దుకాణదారులు రైతులను తప్పుదోవ పట్టించడం ద్వారా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను డంప్‌ చేస్తున్నారు. మార్కెట్‌లో రైతులకు మేలు జరిగేలా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధర, నాణ్యతను నియంత్రించే ఉద్దేశ్యంతో, బ్లాక్‌ మార్కెటింగ్‌, నాసిరకం విత్తనాలు, చెడు పురుగు మందులను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో జీవో నం.14, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల విభాగం ఆధ్వర్యంలో అదనపు స్టాక్‌ పరిమితులపై ఈసీ చట్టం ప్రకారం కేసులు బుక్‌ చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక దుకాణాల యజమానుల అక్రమ నిల్వలను నిరోధించడానికి టోకు, రి-టైల్‌ వ్యాపారులు మొదలైన వారిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చట్టబద్ధమైన హెచ్చరికలు చేస్తోందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement