ఈ మధ్యకాలంలో కమెడియన్స్ హీరోలుగా మారుతున్నారు. అదే తరహాలో కమెడియన్ సూరి కూడా హీరోగా మారాడు. ఆయన నటిస్తోన్న చిత్రం విడుదలై.ఈ చిత్రాన్ని వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నాడు. ఆర్.ఎస్. బ్యానర్ పై నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. ఒన్నాడా నడంధా’ అంటూ ఈ పాట సాగుతోంది. ఫారెస్టు నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ సాంగ్ ను బట్టి అర్థమవుతోంది. ఫారెస్టు ఆఫీసర్ పాత్రలో సూరి కనిపిస్తున్నాడు. ఓ పౌర్ణమినాటి రాత్రి ఆయన ఒక యువతితో కలిసి నడుస్తుండగా ఈ పాట ప్లే అవుతోంది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట మంచి ఫీల్ తో కనెక్ట్ అవుతోంది. ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. ఈ పాటను అనన్య భట్ తో కలిసి హీరో ధనుశ్ ఆలపించడం విశేషం. విజయ్ సేతుపతి .. ప్రకాశ్ రాజ్ .. గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
సూరి హీరోగా విడుదలై.. ఆకట్టుకుంటున్న ధనుశ్ పాట

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement