Sunday, May 9, 2021

వరంగల్‌లో బహిరంగంగా ఓటుకు రూ.3వేలు పంపిణీ

తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో శుక్రవారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ, నల్గొండ, గజ్వేల్, పరకాల, బోధన్‌లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటుకు రూ.3 వేలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు రూ.3వేలు పంచుతున్నట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News