Friday, April 19, 2024

తండ్రి మ‌ద్ద‌తు కాదు.. ప్ర‌జాభిమానం కావాలి – లోకేష్ కి విజ‌య‌సాయి హిత‌వు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: టీడీపీ యువనేత లోకేష్‌ జనం గొంతుగా మారాలంటే తండ్రి చంద్రబాబునాయుడు మద్దతు ఒక్కటే సరిపోదని, ముందుగా ప్రజల విశ్వాసం పొందాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గత 44 నెలలుగా అందిస్తున్న జనరంజక పాలన- అసాధ్యమనుకున్న ఎన్నో ప్రజాహిత చర్యలను సుసాధ్యం చేస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలూ గరిష్ఠ సంతృప్త స్థాయిలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే, 2019లో ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని చెప్పారు. రాజకీయ చౌరాస్తాలో నిలబడి గమ్యం కనబడని దిశగా అడుగులేస్తోందన్నారు. అందుకే, ఎలాగైనా ప్రజలకు వరసగా కొన్ని వారాలు కనపడడానికి టీ-డీపీ అధినేత కుమారుడు నారా లోకేశ్‌ పాదయాత్రకు దిగుతున్నాని చెప్పారు. జనం మధ్య నడవడానికి తెగ ప్రయాస పడుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా అతను ప్రజలకు రాసిన లేఖలో ఇచ్చిన హామీలు హాస్యాస్ప దంగా ఉన్నాయన్నారు. అసలు సమస్యలే లేని రాష్ట్రంలో వాటి పరిష్కారానికి సారథి అవుతానని లోకేశ్‌ ఈ లేఖలో హామీ ఇచ్చాడని అన్నారు. పేద, సామాన్య ప్రజానీకం మేలు అంటేనే పట్టని ఈ ‘యువనేత’ తాను సకల జనుల గొంతుక అవుతానని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముందు ఈ పాదయాత్ర పుణ్యమా అని అఖిలాంధ్ర ప్రజనీకం గురించి చినబాబు తెలుసుకుంటే చాలున్నారు.

తెలుగు భాషే కాదు, ప్రజల మాటలు కూడా అర్ధంకాని ఈయన తెలుగుదేశం పార్టీకి భవితవ్యం ఏమిటో అంచనా వేస్తే చాలున్నారు. అలాంటిది, తాను యువతకు భవిత అవుతానని చెప్పడం ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుం దని చెప్పారు. మొదట పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల బాగోగులు తెలుసుకుని, వారి సంక్షేమానికి ఎలా కృషి చేయాలో తన కాలినడక ద్వారా లోకేశ్‌ తెలుసు కుంటే అదే పదివేలన్నారు… కనీసం తన పార్టీకి గొంతు క కాలేకపోయిన చంద్రబాబు అబ్బాయి సమస్త ఏపీ యువజనులకు భవిత అవుతానంటే నమ్మే అమాయక జనం రాష్ట్రంలో లేరని అన్నారు.. రాజకీయాల్లో ఎదగ డం-తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్సీ కావడం, వెంటనే ఆయన కేబినెట్‌లో మంత్రి కావడం అంత తేలిక కాదని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వా మ్యంలో రాణించాలంటే తాతతండ్రుల వారసత్వంతో పాటు- స్వయం కృషి, అంకితభావం కూడా అవసరమని లోకేశ్‌ హితబోత చేశారు. నలభై రోజులపాటు- నాలుగొందల కిలోమీటర్లు తాను నడిస్తే తన తండ్రికి సీఎం పదవో, తనకు శాసనసభ్యత్వమో దక్కుతాయని ఆశించడం అత్యాశేననే విషయం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీ-డీపీ యువనేతకు అనుభవపూర్వకంగా అర్ధమౌతుందని విజయసాయిరెడ్డి చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement