Wednesday, June 16, 2021

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌కు అస్వస్థత

అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ ( 98) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబీకులు హుటాహుటిన ముంబైలోని హిందూజ దవాఖానకు తరలించారు. కొద్ది రోజులుగా దిలీప్‌ కుమార్‌ శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా బాను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ జలీల్‌ పార్కర్‌ పర్యవేక్షిస్తున్నారు. గత నెలలోనూ ఆయన సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. గతేడాది దిలీప్‌ కుమార్‌ ఇద్దరు సోదరులు అస్లాంఖాన్‌ (88) ఎషాన్‌ ఖాన్‌ (90) ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. 1944లో జ్వార్ భాటా చిత్రంతో బాలీవుడ్‌ పరిశ్రమకు దిలీప్‌ కుమార్‌ పరిచయమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News