Friday, March 29, 2024

శ్రీశ్రీ కవిత్వం ఆలోచనాత్మకం: వెంకయ్యనాయుడు

తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించడమే కాకుండా, తెలుగు కవితను సామాన్యులకు చేరువ చేసిన మహాకవి శ్రీశ్రీ అని అన్నారు వెంకయ్యనాయుడు. నేడు మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. 1000కి పైగా సినీ గీతాలు రచించి, తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన ఆయన కవిత్వం ఆలోచనాత్మకం అని వివరించారు.సంప్రదాయ కవితా విధానాన్ని తోసిరాజని శ్రీశ్రీ… కార్మిక, కర్షక, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల బతుకులనే కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజంలో ఆలోచన రేకెత్తించారని వెంకయ్య వెల్లడించారు. శ్రీశ్రీ ఆలోచనల్లోని అంతరార్ధాన్ని గ్రహించి నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement