Friday, April 19, 2024

వీర‌సింహారెడ్డి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్.. హాజ‌రుకానున్న చిత్ర టీం

హైద‌రాబాద్ జేఆర్సీ క‌న్వెన్ష‌న్ హాల్ లో వీర‌సింహారెడ్డి చిత్రం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి.ఈ సెలబ్రేషన్స్ కి బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది వీర‌సింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. వీరసింహారెడ్డి సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడంతో హీరో బాలకృష్ణ .. అభిమానులు, చిత్ర యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వీర సింహారెడ్డి విజ‌యాన్ని గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరిట వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జనవరి 22వ తేదీన అంటే రేపు అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement