Wednesday, April 24, 2024

మార్చిలో వ‌స్తున్న వీర‌ఖ‌డ్గం…

ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘వీరఖడ్గం’. చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైన సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం…


ఆధునిక సాంకేతికతో ఈ చిత్రాన్ని రూపొందించారు, తమిళ్‌ పొన్ను సృష్టి దాంగే, తన అందాలతో అలరించింది, సీనియర్‌ నటు-లు సత్యప్రకాష్‌ , ఆనంద్‌ రాజ్‌, తమదైన నటనా శైలి తో మెప్పించారు, హాస్యాబ్రహ్మ బ్రహ్మానందం, మదన్‌, తపస్వి, అపూర్వ పృద్విరాజ్‌, టార్జన్‌,ధనరాజ్‌, తాగుబోతు రమేష్‌, చలపతి రావు ,తదితరులు నటించారు.
నిర్మాత మారిశెట్టి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ” సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని ప్రీమియర్‌ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసించారు, ఎమ్‌.ఏ చౌదరి స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. సంపంగి, ప్రేమలో పావని కళ్యాణి, శ్రీమన్నారాయణ లాంటి చిత్రాలకి మాటలు అందించిన రైటర్‌ ఘటికాచలం ఈ చిత్రానికి మాటలు ఇచ్చారు. సంగీత దర్శకులు షయాక్‌ పార్వాజ్‌ స్వరాలని సమకూర్చారు.. పోరాట సన్నివేశాలని నందు, దేవరాజ్‌ మాస్టర్‌, అద్భుతంగా చిత్రీకరించాం. శివరాత్రి నుండి చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. మార్చి మొదటి వారం లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని” ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement