Friday, March 29, 2024

వీడియో: గజ్వేల్‌లో కుంగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు

సిద్ధిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కుంగిపోయాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ఇళ్లల్లో ఫ్లోరింగ్ కుంగిపోయింది. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్ సమీపంలో ఇచ్చిన పునరావాస కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన పలు ఇళ్లు కుంగిపోవడంతో పాటు స్లాబ్‌ల నుంచి నీరు కారుతుందని బాధితులు వాపోతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నాసిరకంగా పనులు చేయడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement