Thursday, April 18, 2024

వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే.. న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్.. మోష‌న్ పోస్ట‌ర్

నేడు హీరో వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే.ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న చిత్రానికి గాండివ‌ధారి అర్జున అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. ఓ కోటలో బ్లాస్టింగ్‌, ఫైరింగ్‌ సన్నివేశాల్లో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై ఫస్ట్‌ లుక్‌తోనే అంచనాలు పెరిగిపోతున్నాయి. మోషన్‌ పోస్టర్‌ గ్లింప్స్ వీడియోకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement