Friday, March 29, 2024

ఆకట్టుకుంటున్న వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ టీజర్

హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాల ఫేం హీరో వరుణ్ సందేశ్ నటించిన కొత్త చిత్రం ‘ఇందువదన’ టీజర్‌ను బుధవారం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే సినిమా లవ్ కమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో వరుణ్ సందేశ్‌కు జంటగా.. ఫర్నాజ్ శెట్టి నటిస్తోంది. ఈ మూవీకి MSR దర్శకత్వం వహిస్తున్నాడు.

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానరుపై ఆదుర్తి మాధవి ‘ఇందువదన’ మూవీని నిర్మిస్తున్నారు. టీజర్‌‌ను రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా మలిచారు. టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉండటంతో ఈ సినిమాపై వరుణ్ సందేశ్ చాలా ఆశలే పెట్టుకున్నాడని తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో దాదాపు ఇండస్ట్రీకి దూరమైన వరుణ్‌కు మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=N1shZL6VnPI

ఈ వార్త కూడా చదవండి: ఆర్.ఆర్.ఆర్‌ మూవీకి కీరవాణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement