Thursday, September 21, 2023

నిరాడంబరంగా వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. నిశ్చితార్థ వేడుకలో చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, ‍ అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థ వేడుక జరిగింది.

- Advertisement -
   

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, ‍అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు. కాగా.. ఈ ఏడాది చివర్లో వీరి వివాహ వేడుక జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement