Saturday, January 29, 2022

వరలక్ష్మి షరత్ కుమార్ తెలుగులో మరో కొత్త సినిమా..

‘క్రాక్‌’ సినిమా విజయంలో భాగస్వామిగా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ‘ఆద్య’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఎం.ఆర్‌. కృష్ణ మామిడాల దర్శకత్వంలో పిఎస్‌ఆర్‌, కుమార్‌ (బాబ్జి వైజాగ్‌ ), ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం నుండి హైదరాబాద్‌లో మొదలవుతోంది.

శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్‌ బేనర్‌ మీద బాబ్జి నిర్మించిన తొలి చిత్రం ‘షికారు’. త్వరలో విడుదలకు ముస్తాబు అవుతోంది. ‘షికారు’ తరువాత బాబ్జి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ‘ఆద్య’. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఆశిష్‌ గాంధీ, విశ్వ కార్తీక్‌, హెబ్బ పటేల్‌, కన్నడ కిషోర్‌, అమితా రంగనాధన్‌, రాజా రవీంద్రా, సూర్య తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement