Saturday, April 20, 2024

హనుమాన్‌లో అంజమ్మగా వ‌ర‌ల‌క్ష్మీ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అధిరింది..

తేజ సజ్జా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో సినిమా ‘హనుమాన్‌’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ఇది భారతీయ తెరపై మొదటి సూపర్‌ హీరో చిత్రం అని మేకర్స్‌ అంటున్నారు. అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి అంజమ్మగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వరలక్ష్మి వధువు వేషంలో చేతిలో కొబ్బరికాయల గుత్తితో కనిపిస్తుంది. అందంతో పాటు కరకుగా కనిపిస్తుంది, ఆమె ఒక గుడి దగ్గర కొంతమంది దుండగులను పట్టుకోవడం కనిపిస్తుంది.

‘హనుమాన్‌’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌, వెంకట్‌ కుమార్‌ జెట్టి లైన్‌ ప్రొడ్యూసర్‌, కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement