Thursday, April 18, 2024

ఫ‌రియా అబ్దుల్లా బ‌ర్త్ డే – ఆక‌ట్టుకుంటోన్న పోస్ట‌ర్

కోలీవుడ్ డెబ్యూ మూవీ వ‌ల్లి మ‌యిల్ లో న‌టిస్తోంది హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా. ఈ చిత్రాన్ని సుశీంద్ర‌న్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం గ‌త నెల‌లో సెట్స్ పైకి వెళ్లింది. తాజాగా మేక‌ర్స్ ఫరియా అబ్దుల్లా పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ..ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు..ఫ‌రియాఅబ్దుల్లా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో.. సంప్ర‌దాయక వ‌స్త్ర‌ధార‌ణ‌తో కూడిన లుక్‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఇక ఈ సినిమా హీరో విజ‌య్ ఆంటోనీ బ‌ర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, భార‌తీ రాజా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం 1980ల బ్యాక్ డ్రాప్‌లో సాగనుంది.త‌మిళంతోపాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా విడుదల కానుంది. ఫ‌రియా అబ్దుల్లా ట్రెడిష‌న‌ల్ లుక్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement