Saturday, December 10, 2022

షారుక్ ఖాన్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా ఫొటో

ముంబైలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ లలో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్యాలెస్ మన్నత్. కాగా ఈ ప్యాలెస్‌ ప్రస్తుతం కొత్త అందాలను సంతరించుకుంది. ఇంటి గేట్‌కు వజ్రాలతో పొదిగిన నేమ్‌ప్లేట్‌ను అమర్చారు. దీంతో కలల సౌధం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. షారుఖ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రూ.35లక్షలు ఖర్చు చేసి వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను తయారుచేయించారు. వజ్రాలతో ఉండే ప్లేట్‌పై ‘మన్నత్’ అని రాసి ఉంటుంది. దీనిని ఇంటి ముందు అమర్చారు.

- Advertisement -
   

ఆ తర్వాత కొద్దిరోజులకు అందులోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. దీంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆ వజ్రం దొరకడంతో తిరిగి అమర్చారు. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. వజ్రాల నేమ్ ప్లేట్‌ని చూసేందుకు మరోసారి ప్రజలు మన్నత్‌ ముందు క్యూ కడుతున్నారు. అక్కడ ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఇంటి వజ్రాల నేమ్ ప్లేట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement